
ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరికి చెందిన మల్టీప్లెక్స్ థియేటర్ ‘పివిపి స్క్వేర్’ ప్రారంభోత్సవం ఈరోజు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, హీరోయిన్ అనుష్క చేతుల మీదుగా దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ గా పేరుగాంచిన ‘పివిపి స్క్వేర్’ ప్రారంభోత్సవం జరిగింది. క్రికెట్ దిగ్గజం సచినని చూడడానికి లక్షలాది అభిమానులు నగరానికి చేరుకోవడంతో, విజయవాడ నగరం కోలాహలంగా మారింది. ఈ సందర్బంగా సచిన్ మాట్లాడుతూ, పివిపి స్క్వేర్ చాలా బాగుందని, అలాగే ఈ మాల్ కి సంబంధించిన పూర్తి భాధ్యతలు నిర్వహించిన పోట్లురి పద్మను అయన ప్రత్యేకంగా అభినందిస్తూ, ఒక మహిళ ఇంతటి పెద్ద మాల్ నిర్మాణ భాధ్యతలు చెపట్టడం మహిళలకే గర్వకారణం అని కొనియాడారు. తనకు విజయవాడ నగరం చాలా నచ్చిందని, ఇక్కడి ప్రజలకు అయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ ప్రాంగణం సచిన్, పివిపి పేర్లతో మారుమోగిపోయింది.
‘పివిపి స్క్వేర్’లో ప్రత్యేకంగా ఒక గ్రీన్ మ్యాట్ లో ఏర్పాటు చేసిన సచిన్ విగ్రహం అందర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, నిర్మాతలు అశ్వినిదత్, దిల్ రాజు, 14 రీల్స్ కు చెందిన రాము ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర, ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని పివిపికి శుభాకాంక్షలు తెలిపారు.
ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

