
రామ్ గోపాల్ దర్శకత్వంలో విష్ణు హీరోగా నటించిన ‘అనుక్షణం’ సినిమాను వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. అదే బాటలో ‘కరెంట్ తీగ’ను కూడా వేలం వేస్తున్నారు అని వెబ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై హీరో మంచు మనోజ్ ను సంప్రదించగా అటువంటిది ఏమి లేదని చెప్పారు. ‘కరెంట్ తీగ’ సినిమాను వేలం వేసే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ‘అనుక్షణం’, ‘కరెంట్ తీగ’ సినిమాలకు మంచు విష్ణు నిర్మాత కావడంతో ఈ వార్తలు వచ్చాయి.
మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కరెంట్ తీగ’ సినిమాలో సన్నీ లియోన్ ప్రత్యేక పాత్రలో నటించింది. సన్నీ నర్తించిన ఐటెం సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని సమాచారం. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అచ్చు సంగీతం అందిస్తున్నారు.

