
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా టైటిల్ మారిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మొదట ‘గొల్లభామ’ అనే టైటిల్ పెట్టినట్టు ప్రచారం జరిగింది.
తాజా సమాచారం ప్రకారం ‘ముకుందా’ లేదా ‘ముకుందా మురారి’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మెగా ఫ్యామిలీని సంప్రదించిన తర్వాత టైటిల్ ప్రకటిస్తారు.
వరుణ్ తేజ సరసన పూజ హెడ్గే నటిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కి.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు.

