గీతాంజలి డైరెక్టర్ కి హార్ట్ అట్టాక్.!

గీతాంజలి డైరెక్టర్ కి హార్ట్ అట్టాక్.!

Published on Aug 5, 2014 5:00 PM IST

Geethanjali
అంజలి ప్రధాన పాత్త్రలో నటిస్తున్న ‘గీతాంజలి’ సినిమా ద్వారా రాజ కిరణ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఆయన ఈ రోజు హార్ట్ అట్టాక్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. మాకు అందిన సమాచారం ప్రకారం రాజ కిరణ్ హార్ట్ అట్టాక్ కి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయకుండా ఆలస్యం చేయడమే అని అంటున్నారు. ఆగష్టు 8న ఈ సినిమా రిలీజ్ కానుంది కానీ ఇప్పటి వరకూ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదు.

హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా కనిపించనున్నాడు. హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, రావు రమేష్, సత్యం రాజేష్, శకలక శంకర్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. ప్రముఖ రచయిత కోనా వెంకట్ సమర్పణలో ఎంవివి సినిమా బ్యానర్ పై ఎంవివి సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ద్వారా రాజ కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కోన వెంకట్ ఈ సినిమాకి సమర్పకుడిగానే కాకుండా స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ని కూడా అందించాడు.

తాజా వార్తలు