వరుణ్ తేజ – శ్రీకాంత్ అడ్డాల మూవీ డబ్బింగ్ విశేషాలు

వరుణ్ తేజ – శ్రీకాంత్ అడ్డాల మూవీ డబ్బింగ్ విశేషాలు

Published on Aug 6, 2014 1:00 PM IST

varun-tej (1)
మెగా వారసుడు వరుణ్ తేజ హీరోగా పరిచయం అవుతున్న మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు బుధవారం ఉదయం శబ్దాలయా థియేటర్లో ప్రారంభం అయ్యాయి. దీనికి సంబందించిన పూజ కార్యక్రమాలలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, తనికెళ్ళ భరణి మరియు మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. మిక్కి.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు.

తొలుత ఈ సినిమాకు ‘గొల్లభామ’ అనే పెట్టినట్టు ప్రచారం జరిగింది. తాజాగా ‘ముకుందా’ లేదా ‘ముకుందా మురారి’ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు. మెగా వారసుడి తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఠాగూర్‌ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదావరి పరిసర ప్రాంతాలు, అమలాపురం, యానం తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు.

తాజా వార్తలు