జ్యోతిక రీ-ఎంట్రీ సినిమాలో నటిస్తాను – సూర్య.

జ్యోతిక రీ-ఎంట్రీ సినిమాలో నటిస్తాను – సూర్య.

Published on Aug 6, 2014 8:19 PM IST

Surya-Jyothika

తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిక వెండితెరకు దూరమయ్యారు. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలలో నటిస్తాను అంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని సూర్య పలు సందర్భాలలో చెప్పారు. తాజాగా మరోసారి జ్యోతిక రీ-ఎంట్రీ విషయం తెరపైకి వచ్చింది. ఒక తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సూర్య జ్యోతిక రీ-ఎంట్రీపై మాట్లాడారు.

జ్యోతిక అభిమానులలో నేను ఒకడిని. తను రీ-ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో నేను కూడా ఎదురు చూస్తున్నాను. పెళ్లి తర్వాత పిల్లలు, కుటుంబ భాద్యతలు వల్ల జ్యోతిక మళ్లీ వెండి తెరపై కనపడడానికి వీలు కుదరలేదు. త్వరలో తన రీ-ఎంట్రీ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడిస్తాం. ఆ సినిమాలో నేను కూడా నటిస్తాను అని సూర్య చెప్పారు.

2డి ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించిన సూర్య నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. జ్యోతిక రీ ఎంట్రీ సినిమాను సూర్య స్వయంగా నిర్మిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జ్యోతిక కథలు వింటున్నారు. త్వరలో రీ ఎంట్రీ సినిమా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

తాజా వార్తలు