సౌత్ ఇండియాలో ఉన్న విలక్షణ నటుల్లో మొదటి 5 మందిలో ఒకడిగా చియాన్ విక్రమ్ పేరు చెప్పుకోవచ్చు. విక్రమ్ తను చేస్తున్న సినిమా కోసం ఏమి చెయ్యడానికైనా సిద్దపడతాడు. విక్రమ్ హీరోగా చేసిన శివ తాండవం సినిమా 2012 లో వచ్చింది. అప్పటి నుంచి విక్రమ్ శంకర్ సినిమాలో నిమగ్నమయ్యాడు. తన లుక్ మొత్తం మార్చుకొని మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఈ సినిమాలో కనిపించనున్నాడు. విక్రమ్ ఇలా రెండున్నర సంవత్సరం పాటు కష్టపడి చేసిన ‘ఐ’ సినిమా ట్రైలర్ నిన్ననే విడుదలైంది. ట్రైలర్ చూసిన వారందరూ అతని డెడికేషన్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తైతే విక్రమ్ ‘ఐ’ లో చేస్తున్న వేర్ వోల్ఫ్ పాత్ర కోసం తన దంతాలను కూడా తీసేయించుకున్నాడు. అసలు విషయంలోకి వెళితే వేర్ వోల్ఫ్ లో పెర్ఫెచ్తిఒన్ కోసం పై వరుసలో ముందు ఉండే రెండు దంతాలను తీసేయించుకున్నాడు. ఆ పార్ట్ కి సంబందించిన షూటింగ్ పూర్తయ్యాక తన సొంత మనీతో మళ్ళీ ఆ దంతాలను మార్చుకున్నాడు. ఇంతలా డెడికేషన్ చూపించిన విక్రమ్ పై ఐ టీం ఎడతెరపి లేకుండా ప్రశంశలు కురిపిస్తున్నారు.
‘ఐ’ టీజర్ విడుదలై 24 గంటలు కాకముందే అప్పుడే పదమూడున్నర లక్షల క్లిక్స్ రాబట్టుకుంది. విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించాడు.


