రానా సరసన సన్నీ లియోన్..?

రానా సరసన సన్నీ లియోన్..?

Published on Sep 16, 2014 10:22 PM IST

Rana_sunnyleone

రానా దగ్గుబాటి సరసన హీరోయిన్ గా సన్నీ లియోన్ నటిస్తుందా..? అంటే అవుననే అంటుంది ముంబై మీడియా. బాలీవుడ్ దర్శకుడు అంటోనీ డిసౌజా భార్య జాస్మిన్ డిసౌజా దర్శకురాలిగా పరిచయం అవుతున్న ‘వన్ నైట్ స్టాండ్’ సినిమాలో రానా, సన్నీ లియోన్ జంటగా నటిస్తున్నారని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆరడుగుల రానా సరసన హాట్ హీరోయిన్ సన్నీ లియోన్ నటిస్తే హాటెస్ట్ కాంబినేషన్ అవుతుందని అభివర్ణిస్తున్నారు.

ఈ సినిమాలో సన్నీ లియోన్ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో నటిస్తుంది. రానా పరిచయం తర్వాత ఆమె జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది సినిమా కధాంశం. నవంబర్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందట. పూర్తిగా సినిమా విదేశాలలో చిత్రీకరిస్తారు.

తెలుగుతో పాటు హిందీ సినిమాలపై రానా చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. ఇక్కడ ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక సినిమాలో నటిస్తున్నాడు. హిందీలో ‘బేబీ’ అనే మోడరన్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు