
ఓవర్సీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులలో మహేష్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని రికార్డు థియేటర్లలో ‘ఆగడు’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. యు.ఎస్.ఏలో ఫస్ట్ డే మొత్తం 159 లొకేషన్లలో ‘ఆగడు’ రిలీజ్ అవుతుంది. ఒక తెలుగు ఇన్ని లొకేషన్లలో విడుదల కావడం ఇదే తొలిసారి.
మహేష్ గత సినిమాల కలెక్షన్ల రికార్డును ‘ఆగడు’ క్రాస్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాదించిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘1 నేనొక్కడినే’ సినిమాలు యు.ఎస్.ఏ మార్కెట్లో కాసుల కనక వర్షం కురిపించాయి. ఘనవిజయం సాదించాయి.
శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ లో కనువిందు చేయనుంది. తమన్ సంగీత దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

