హాస్పిటల్ సన్నివేశాల చిత్రీకరణలో వెంకటేష్, పవన్ కళ్యాణ్

హాస్పిటల్ సన్నివేశాల చిత్రీకరణలో వెంకటేష్, పవన్ కళ్యాణ్

Published on Sep 17, 2014 3:54 PM IST

gopala-gopala
హిందీలో ఘనవిజయం సాదించిన ‘ఓ మై గాడ్’ ఆధారంగా తెలుగులో రూపొందుతున్న సినిమా ‘గోపాల గోపాల’. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడుగా, దేవుడిపై కేసు వేసే గోపాలరావు పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. హాస్పిటల్ లో పవన్, వెంకిలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఒక సామాన్య మానవుడు దేవుడిపై కేసు వేస్తే ఎం జరుగుతుంది అనే ఆసక్తికరమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని(డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, మధుశాలిని, దీక్షా పంత్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2015 సంక్రాంతి కానుకగా ‘గోపాల గోపాల’ విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు