ఫస్ట్ మూవీ కోసం కొరియోగ్రాఫర్ గా మారిన అక్షర హాసన్

ఫస్ట్ మూవీ కోసం కొరియోగ్రాఫర్ గా మారిన అక్షర హాసన్

Published on Sep 17, 2014 5:08 PM IST

akshara-hassan
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఇప్పటికే హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకుంది. ఇదే బాటలో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా ఎంటర్ అయ్యింది. అక్షర హాసన్ బాలీవుడ్ లో రూపొందుతున్న ‘శమితాబ్’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, ధనుష్ మెయిన్ రోల్స్ లో కనిపిస్తున్నారు.

శృతి హాసన్ లానే అక్షర హాసన్ కూడా మల్టీ టాలెంటెడ్.. అక్షర మంచి డాన్సర్ కావడంతో తనలోని టాలెంట్ గుర్తించిన డైరెక్టర్ సినిమాల్ని ఓ పాటలో తన స్టెప్స్ తనే కంపోజ్ చేసుకునేలా కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాడు. సినిమాలో డాన్స్ కి పెద్ద ప్రాధాన్యత లేకపోయినా డైరెక్టర్ బల్కి తన టాలెంట్ చూసి కథలో ఈ అవకాశం కల్పించారు. మరి అక్షర హాసన్ శమితాబ్ సినిమాలో ఒక నటిగానే కాకుండా తన డాన్సింగ్ స్కిల్స్, కొరియోగ్రాఫర్ గా కూడా తన టాలెంట్ నిరూపించుకుంటుందని ఆశించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు