సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం ‘ఆగడు’..

సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం ‘ఆగడు’..

Published on Sep 18, 2014 12:20 AM IST

Mahesh-Babu-Aagadu-Movie
‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందం, మహేష్ బాబు చేసిన కామెడీని ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. కడుపుబ్బా నవ్వించింది. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘ఆగడు’లో దానికి రెట్టింపు వినోదాన్ని వీరిద్దరూ అందివ్వనున్నారు. సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్స్, ప్రోమోలలో బ్రాహ్మి చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. శ్రీను వైట్ల ‘వెంకి’ సినిమా ట్రైన్ ఎపిసోడ్ తరహాలో ‘ఆగడు’లో కామెడీ ట్రాక్ కడుపుబ్బా నవ్విస్తుందని నిర్మాతలు చెప్పారు.

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆగడు’ సినిమాపై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ సినిమాకి అదనపు ఆకర్షణ. తమన్ సంగీత దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ సినిమా దాదాపు 2000 ధియేటర్లలో విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు