డబ్బింగ్ ప్రారంభించిన ‘బాహుబలి’.

డబ్బింగ్ ప్రారంభించిన ‘బాహుబలి’.

Published on Sep 18, 2014 11:44 AM IST

baahubali

దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక సినిమా ‘బాహుబలి’ నిర్మాణంతర కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టారు. త్వరలో తమిళ వెర్షన్ ‘మహాబలి’ డబ్బింగ్ వర్క్స్ ప్రారంభిస్తారు. ఈ సినిమా మొదటి పార్ట్ 2015 వేసవిలో విడుదల చేయనున్నారు.

ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ప్రభాస్ మరియు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు.

తాజా వార్తలు