
సంపూర్ణేష్ బాబు నటించిన ‘హృదయకాలేయం’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదరగొట్టింది. ఈ సినిమా విజయానికి వినూత్న ప్రచారాలు చేయూతనిచ్చాయి. ప్రస్తుతం సంపూ ‘కొబ్బరిమట్ట’ షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఆ సినిమాలో మూడు విభిన్న గెట్ అప్ లతో మనల్ని అలరించనున్నాడు
తాజా సమాచారం ప్రకారం సంపూ నటించబోయే ఒక చిత్రాన్ని మంచు వారి ఫ్యామిలీ నిర్మించనుందట. ఆ చిత్రానికి సింగం 123 అని పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. సంపూ చాలా త్వరగా ఇండస్ట్రీ పెద్దలకు దగ్గరవడం ఆనందకరం

