మిలియన్ మార్క్ ని చేరుకున్న ఆగడు

mahesh-babu-aagadu-review
శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అబ్బురపరిచే కలెక్షన్లను సాధించింది . సమీక్షల విషయం ఎలాగున్నా ఒక్కసారైనా సినిమాని చూడాలి అనుకునే ప్రేక్షకుల సంఖ్య అనంతం ఉండడంతో ఈ సినిమా రికార్డులకు కొదవలేకుండా పోయింది

గురువారం వేసిన ప్రీమియర్ షోలతో కలుపుకుని ఆగడు సినిమా మిలియన్ మార్కుని సొంతం చేసుకుని టాలీవుడ్ లో కొత్త రికార్డ్ సృష్టించింది. మహేష్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ గా సినిమా ఆద్యంతం అలరించి అనదరి ప్రశంసలను పొందుతున్నాడు

ఈ సినిమాలో తమన్నా నాయిక. శృతిహాసన్ ఐటెం సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తమన్ సంగీతదర్శకుడు. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది

Exit mobile version