
ఈ ఏడాది తన పుట్టిన రోజున అభిమానులకు ‘ఉత్తమ విలన్’ సినిమా కానుకగా ఇవ్వనున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. తెయ్యమ్ కళాకారుడిగా, సినిమా నటుడిగా కమల్‌హాసన్ రెండు పాత్రల్లో నటించిన ఈ సినిమాను కమల్ హాసన్ పుట్టిన రోజైన నవంబర్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలను కమల్ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
కమల్ నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో అద్బుతమైన నటనను కనబరిచారు. క్లైమాక్స్ 10 నిముషాలు సినిమాకు చాలా కీలకం అని దర్శకుడు తెలిపారు. పూజా కుమార్, ఆండ్రియాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బాలచందర్, కె.విశ్వనాధ్ వంటి ప్రముఖ దర్శకులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.

