
రెండున్నర ఏళ్ళ పాటు సినిమా యూనిట్ అందరూ పడిన కష్టం నేటితో ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే బాలన్స్ ఉన్నాయి. విక్రమ్, అమీ జాక్సన్ జంటగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న దృశ్యకావ్యం ‘ఐ’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. షూటింగ్ పూర్తయినా నిర్మాణంతర కార్యక్రమాలకు చాలా సమయం పట్టొచ్చని, అందువల్ల అనుకున్న తేదికి ‘ఐ’ విడుదల చేయడం కష్టమనే అభిప్రాయం డిస్ట్రిబ్యూటర్లులో వ్యక్తం అయ్యింది. అయితే నిర్మాతలు ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని దృడ సంకల్పంతో ఉన్నారు.
స్వర మాంత్రికుడు ఏఅర్ రెహమాన్ అందించిన తమిళ ఆడియో ఇటివల విడుదల అయ్యాయి. త్వరలో తెలుగు ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా చైనా సూపర్ స్టార్ జాకీ చాన్ హాజరవుతారని తెలిపారు. సుమారు 180 కోట్ల భారి బడ్జెట్ తో ఆస్కార్ రవిచంద్రన్ ఈ సినిమాను నిర్మించారు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి.

