శర్వానంద్, నిత్యాల ప్రేమ కథకు టైటిల్ ఖరారు.

శర్వానంద్, నిత్యాల ప్రేమ కథకు టైటిల్ ఖరారు.

Published on Sep 27, 2014 2:14 PM IST

Malli-malli
చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ సినిమాలో ‘మళ్లి మళ్లీ ఇది రాని రోజు’ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాను కెఎస్ రామారావు నిర్మించారు. ఇప్పుడు ఈ పాటలో మొదటి అక్షరాలను తమ సినిమా టైటిల్ గా పెట్టారు కెఎస్ రామారావు మరియు యువ హీరో శర్వానంద్.

శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా కెఎస్ రామారావు సమర్పణలో కె.ఏ.వల్లభ నిర్మిస్తున్న సినిమాకు ‘మళ్లి మళ్లీ ఇది రాని రోజు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ‘ఓనమాలు’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా రూపొందుతున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు.

ప్రేమకు కులం, మతం అడ్డుకావనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ ఈ సినిమాలో స్పోర్ట్స్ మెన్ గా నటిస్తున్నారు. ‘రన్ రాజా రన్’ వంటి ఫ్రెష్ లవ్ స్టొరీతో సక్సెస్ కొట్టిన శర్వానంద్ మరో లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు