సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న’100% లవ్’ ఐటెం గర్ల్..

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న’100% లవ్’ ఐటెం గర్ల్..

Published on Nov 5, 2014 3:39 PM IST

Maryam Zakaria
సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులకు ప్రైవసీ ఉండదనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చిన్న సంఘటన జరిగినా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పుకార్లు షికారు చేస్తాయి. అటువంటిది ఒక హీరోయిన్, ఐటెం గర్ల్ తనకు పెళ్ళైన విషయాన్ని రెండు ఏళ్ళు రహస్యంగా ఉండడం గొప్ప విషయమే.

తెలుగులో ‘100% లవ్’, ‘నా ఇష్టం’, ‘దమ్ము’, ‘సికందర్’ సినిమాలలో ఐటెం సాంగులలో అలరించిన స్వీడన్ అందగత్తె మరియం జకారియా. హిందీలో ‘గ్రాండ్ మస్తీ’తో హిట్ అందుకుంది. కొరియోగ్రాఫర్ ఆనంద్ ను 2012 ఏప్రిల్ నెలలో మరియం పెళ్లి చేసుకుంది. గోవా బీచ్ లో వారం రోజుల పాటు జరిగిన వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం మరియం గర్భవతి.

పెళ్ళిని విషయం సీక్రెట్ గా ఉంచాలని నేను, మా ఆయన కలసి తీసుకున్న నిర్ణయం. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందికి ఈ విషయం తెలిసినా మా వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇస్తూ బయట మాట్లాడలేదు. వచ్చే ఏడాది ప్రేమికుల రోజున డెలివరీ కాబోతుంది. ఈ క్షణం కోసం చాల రోజుల నుండి ఎదురుచూస్తున్నాను. అని మరియం తెలిపింది. వివాహ జీవితం చాలా అనందంగా ఉంది. భవిష్యత్ లో తిరిగి సినిమాలలో నటిస్తాను. అని చెప్పింది.

తాజా వార్తలు