ప్రణితపై వచ్చిన పుకార్లలో నిజం లేదన్న త్రివిక్రమ్

ప్రణితపై వచ్చిన పుకార్లలో నిజం లేదన్న త్రివిక్రమ్

Published on Nov 6, 2014 12:23 AM IST

trivikaram
మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. అందులో ప్రణితని తీసుకున్నారు అనే వార్తలు వచ్చాయి. తాజాగా ప్రణిత సెట్లో ఉండగా త్రివిక్రమ్ ప్రణితపై కోప్పడితే, తను అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయిందనే వార్తలను ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది.

కానీ ఇక్కడ ఈ చిత్ర టీంతో పాటు పలువురిని షాక్ చేసిన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో అసలు హీరోయిన్ కాకపోవడం. ప్రణిత త్రివిక్రమ్ సినిమాలో నటించడం లేదు. అందుకే త్రివిక్రమ్ ఈ న్యూస్ ప్రచురించిన వారికి సూటిగా ఓ ప్రశ్నని విసిరాడు. ‘అసలు సెట్ లోనే లేని హీరోయిన్ ని ఓ డైరెక్టర్ ఎలా అరవగలడని’ అడిగాడు. మరి దీనికి ఆ పత్రిక వారు ఏమి సమాధానం ఇస్తారో చూడాలి.

అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహ ముఖ్య పత్రాలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జులాయి ఫేం కె. రాధాకృష్ణ ఈ సినిమాకి నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు