
కింగ్ నాగార్జున చేసిన ఛాలెంజ్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తన కుటుంబ సభ్యులతో కలసి నాగార్జున స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. అనంతరం అల్లు అర్జున్ ను స్వచ్ఛ భారత్ కాంపెయిన్ లో పోల్గోనవలసిందిగా నామినేట్ చేశారు.
‘స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నన్ను నామినేట్ చేసినందుకు నాగార్జున గారికి థాంక్స్. త్వరలో స్వచ్ఛ భారత్ మిషన్ లో పోల్గొంటాను’ అని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేర్కొన్నారు.
తెలుగు పరిశ్రమ ప్రముఖుల నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. నాగార్జున, రామ్, నారా రోహిత్ తరితరులు ఇప్పటికే ఈ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అల్లు అర్జున్, సమంత, హన్సికలు త్వరలో తమ భాద్యతను నిర్వర్తిస్తామని తెలిపారు.


