
హుదూద్ తుఫాన్ వల్ల వైజాగ్ మరియు ఉత్తరాంధ్రని బాగా దెబ్బతిన్న ఉత్తరాంధ్ర బాధితుల్ని ఆదుకోవడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై మీకు మేమున్నాం అంటూ వారి సహాయార్ధం చేస్తున్న కార్యక్రమం ‘మేము సైతం’. ఈ వేడుక నవంబర్ 30న హైదరాబాద్ లో జరగనుందని, ఇది 13 గంటల పాటు కంటిన్యూగా జరిగే లైవ్ ప్రోగ్రాం అని మేము నిన్ననే తెలియజేశాం.
గత కొద్ది రోజులుగా ‘మేము సైతం’ ప్రోగ్రాంని ప్రత్యక్ష ప్రసారం చేసే రైట్స్ కోసం తెలుగులో నాలుగు టాప్ 4 ఎంటర్టైనింగ్ చానల్స్ అయిన ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ మరియు జీ టీవీ భారీ ఎత్తున పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో చివరికి జెమిని టీవీ వారు మేము సైతం ప్రత్యక్ష ప్రసార రైట్స్ ని ఓ భారీ మొత్తానికి దక్కించుకున్నారు.
మీ అభిమాన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ బాబు మొదలైన అందరు హీరోలు హాజరు కానున్నారు. అందులో పలువురు హీరోలు లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి నిర్వహించనున్న ‘మేము సైతం’ వేడుక గురించిన మరిన్ని ప్రత్యేకమైన విశేషాలు ఎప్పటికప్పుడు మీకందజేస్తూనే ఉంటాం. దానికోసం కంటిన్యూ గా123telugu.com ని విజిట్ చేస్తూ ఉండండి.

