ఇంటర్వ్యూ : రెజినా – టాలీవుడ్ లో లిప్ లాక్ ట్రెండ్ సెట్ చేశా..

ఇంటర్వ్యూ : రెజినా – టాలీవుడ్ లో లిప్ లాక్ ట్రెండ్ సెట్ చేశా..

Published on Nov 8, 2014 4:14 PM IST

Regina
రెజినా కసాండ్రా… అందం, అభినయం రెండిటిలో అద్బుతం అనిపించే నటి. ‘పవర్’ విజయం తర్వాత ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియాతో కాసేపు ముచ్చటించింది. ఆ విశేషాలు మీకోసం.

ప్రశ్న) ‘పిల్లా నువ్వులేని జీవితం’లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

స) నా గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో నేను చాలా సీరియస్ టైపు క్యారెక్టర్ లో నటించాను. సమస్యలలో చిక్కుకున్న ఓ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను.

ప్రశ్న) సాయి ధరమ్ తేజ్ తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?

స) అతనితో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. అందరితో ఈజీగా కలసిపోయే మనిషి. సాయి వ్యక్తిత్వం చాలా సింపుల్ గా ఉంటుంది. మెగాస్టార్ వారసుడిగా సినిమాలో ఎంట్రీ ఇచ్చినా కుటుంబ నేపధ్యం గురించి అస్సలు మాట్లాడడు. నటన అతని బ్లడ్ లోనే ఉంది. డాన్సుల విషయంలో చాలా బాగా కష్టపడతాడు. సాయితో షూటింగ్ అంటే సరదాగా గడచిపోతుంది. మరోసారి అతనితో కలసి పని చేయడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.

ప్రశ్న) దర్శకుడు రవి కుమార్ చౌదరి వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి..?

స) సెట్స్ లో నటీనటులకు చాలా స్వేచ్ఛను ఇస్తారు. ఒక సన్నివేశం వివరించిన తర్వాత నేను ఎలా నటించాలి అనుకుంటున్నానో..! అలా నా స్టైల్ లో చేయమనేవారు. ఆయనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది.

ప్రశ్న) సినిమాలలో హీరోతో లిప్ లాక్స్ ద్వారా మీరు ఫేమస్ అయ్యారు. దీనిపై మీ స్పందన..?

స) నవ్వుతూ… ముందుగా, ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశం లేదు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సన్నివేశంలో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చెప్పాలంటే.. తెలుగులో లిప్ కిస్సుల ట్రెండ్ నేనే స్టార్ చేశానని గర్వంగా ఫీల్ అవుతాను.

ప్రశ్న) భవిష్యత్ లో, మీరు ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు..?

స) నటనలో వైవిధ్యం చూపించాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను. నా వద్దకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా కల. ఎటువంటి పాత్రలోనైనా రెజినా నటించగలదు అనే పేరు సొంతం చేసుకోవాలి.

ప్రశ్న) ఇప్పటివరకూ స్టార్ హీరోల సినిమాలలో నటించకపోవడానికి కారణం..?

స) రవితేజ సరసన ‘పవర్’ సినిమాలో నటించాను. తాజాగా అల్లు అర్జున్ తో కలసి ఒక యాడ్ చేశాను. నెమ్మదిగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.

ప్రశ్న) మీ ఉద్దేశ్యం ప్రకారం మెగా ఫ్యామిలీలో బెస్ట్ డాన్సర్ ఎవరు..?

స) చిరంజీవి గారు అల్టిమేట్ డాన్సర్ అండి. ప్రజెంట్ యంగ్ హీరోలలో బన్ని డాన్స్ అంటే నాకు బాగా ఇష్టం.

ప్రశ్న) టాలీవుడ్ లో ఇతర హీరోయిన్ల కాంపిటీషన్ తట్టుకుంటూ మీ ఉనికిని ఎలా కాపాడుకుంటున్నారు..?

స) ఒక్క సినిమా ఇండస్ట్రీ అని కాదు, ప్రతి ఇండస్ట్రీలో, వర్క్ లో కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ అనేది లేకపోతే మనలో అత్యుత్తమ ప్రతిభ బయట పడదు. ఈ ఆరోగ్యకరమైన పోటి ఉండడం మంచిదే.

ప్రశ్న) ఇతర భాషలలో మీరు నటిస్తున్న సినిమా సంగతుల గురించి చెప్పండి..?

స) ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో నటిస్తున్నాను. కాని, నేను ఎక్కువగా తెలుగు సినిమాలపైనే కాన్సంట్రేట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు