
తన ఒక్కగాన ఒక్క కుమారుడు, యువ హీరో ఆది పెళ్లి పిలుపులను ప్రారంభించారు డైలాగ్ కింగ్ సాయి కుమార్. ఇటివల రాజమహేంద్రవరంకు చెందిన అరుణ అమ్మాయితో అక్టోబర్ 3న హైదరబాద్ లో ఆది నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న జరగబోయే వీరి వివాహా మహోత్సవానికి సన్నిహితులను, సినీ ప్రముఖులను సాయి కుమార్ ఫ్యామిలీ ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు.
ఆది తాతయ్య పిజే శర్మ, తండ్రి సాయి కుమార్, బాబాయిలు రవి శంకర్, అయ్యప్ప శర్మలు సినిమా రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో దశాబ్దాల అనుభవం ఉంది. ఎందరో ప్రముఖులతో మంచి సత్సంభందాలు ఉన్నాయి. ఆది వివాహా వేడుకకు అతిరథ మహారధులు హాజరయ్యే అవకాశం ఉంది.

