‘స్పెషల్ 26’ రీమేక్ లో మంచు విష్ణు.?

‘స్పెషల్ 26’ రీమేక్ లో మంచు విష్ణు.?

Published on Nov 9, 2014 6:04 PM IST

Vishnu

2013లో బాలీవుడ్ లో విడుదలైన హిందీ సినిమా ‘స్పెషల్ 26’ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా గెలుచకుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని సౌత్ ఇండియన్ అన్ని భాషల్లోనూ(తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం) రీమేక్ చెయ్యడం కోసం తమిళ డైరెక్టర్ త్యాగరాజన్ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లోనో ఎవరైతే ఈ సినిమా రీమేక్ లో హీరోగా సరిపోతారా అని చూస్తున్నారు.

మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగులో ‘స్పెషల్ 26’ సినిమాకి మంచు విష్ణు సరిపోతాడని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చల దశలో ఉంది. అన్నీ కుదిరితే స్పెషల్ 26 తెలుగు రీమేక్ లో మంచు విష్ణు హీరోగా నటించే అవకాశం ఉంది. ఇటీవలే మంచు విష్ణు ‘అనుక్షణం’ సినిమాలో టఫ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందరినీ మెప్పించాడు. అందువలనే త్యాగరాజన్ విష్ణుని సంప్రదించినట్లు సమాచారం. అలాగే మిగిలిన 3 భాషల్లో కూడా ఈ స్క్రిప్ట్ కి సరిపోయే హీరోల కోసం అన్వేషిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లియర్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు