నాగార్జున సరసన లావణ్య త్రిపాటి.?

నాగార్జున సరసన లావణ్య త్రిపాటి.?

Published on Nov 9, 2014 10:13 PM IST

nagarjuna-lavanya-tripati
‘మనం’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కింగ్ నాగార్జున ఇంకా తన తదుపరి చిఎన్మాని సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ గ్యాప్ లో ఆయన బుల్లితెరపై చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో బిజీ గా ఉన్నాడు. ఫస్ట్ సీజన్ పూర్తయి రెండవ సీజన్ కూడా త్వరలో మొదలవడానికి అన్నీ సిద్దం అవుతున్నాయి. నాగార్జున ఈ సారి మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 2 తో పాటు తన తదుపరి సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా నవంబర్ 15 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

కళ్యాణ్ కృష్ణ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్రకి జోడీగా ఇప్పటికే రమ్యకృష్ణని ఖరారు చేయగా, గత కొద్ది రోజులుగా మరో పాత్ర కోసం అన్వేషిస్తున్నారు. తాజా సమాచారం మరో హీరోయిన్ పాత్రకి అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాటిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ నవ మన్మధుడులా కనిపించే నాగార్జున పక్కన ఈ భామ సరిపోతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాధా మోహన్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు