99వ సినిమా కోసం వర్కౌట్స్ చేస్తున్న బాలకృష్ణ

99వ సినిమా కోసం వర్కౌట్స్ చేస్తున్న బాలకృష్ణ

Published on Nov 9, 2014 10:33 PM IST

balakrishna
తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ప్రధముడని చెప్పవచ్చు. నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమా ఈ సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం బాలకృష్ణ సత్యదేవ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇది కాకుండా బాలకృష్ణ తను నటించబోయే 99వ సినిమాకి రంగం సిద్దం చేసుకుంటున్నాడు.ఇప్పటికే శ్రీవాస్ డైరెక్షన్ లో 99వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ లతో కలిసి శ్రీవాస్ కథ ని సిద్దం చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ స్లిమ్ గా కనిపిస్తాడని సమాచారం అందుకోసం తగిన వర్కౌట్స్ ని బాలకృష్ణ ఇప్పటికే మొదలు పెట్టాడని సమాచారం. మరి ఈ సినిమా పట్టాలెక్కితే అభిమానులు బాలకృష్ణని స్లిమ్ గా చూడొచ్చు.

ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు