కన్ఫర్మ్ : ‘బీరువా’తో ఫ్రెండ్షిప్ చేస్తున్న సందీప్ కిషన్.

కన్ఫర్మ్ : ‘బీరువా’తో ఫ్రెండ్షిప్ చేస్తున్న సందీప్ కిషన్.

Published on Nov 10, 2014 2:21 PM IST

Beeruva
నటుడిగా, హీరోగా కెరీర్ ఆరంభం నుండి ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న యువ హీరో సందీప్ కిషన్. ప్రయోగాత్మక సినిమాలకు కమర్షియల్ అంశాలు జోడిస్తూ వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. తాజాగా మరో ఆసక్తికరమైన టైటిల్ తో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

‘నా ఊపిరి’ ఫేం కన్మణి దర్శకత్వంలో సందీప్ కిషన్ నటిస్తున్న సినిమాకు ‘బీరువా’ అనే టైటిల్ ఖరారు చేశారు. సంజుగాడి ఫ్రెండ్ అనేది ఉప శీర్షిక. రెండు ప్రతిష్టాత్మక సంస్థలు ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఉషా కిరణ్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. నవంబర్ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సందీప్ కిషన్ తెలియజేశారు. యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకోస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సినిమాలో ‘బీరువా’ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని దర్శకుడు తెలిపారు.

సందీప్ కిషన్ సరసన సురభి హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ తమన్ ఫస్ట్ టైం సందీప్ కిషన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు