క్రిష్ నిర్మాతగా ‘దాగుడుమూతల దండాకోరు’

క్రిష్ నిర్మాతగా ‘దాగుడుమూతల దండాకోరు’

Published on Nov 11, 2014 3:24 PM IST

krish

‘గమ్యం’ సినిమాతో తన టాలెంట్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన డైరెక్టర్ క్రిష్. ఇటీవలే క్రిష్ హిందీలో రీమేక్ చేస్తున్న తమిళ సినిమా ‘రమణ’ షూటింగ్ ని పూర్తి చేసాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అక్షయ్ కుమార్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాని సంజయ్ లీల భన్సాలి నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే క్రిష్ నిర్మాతగా తెలుగులో ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసాడు.

ఇటీవలే క్రిష్ తమిళంలో ఎఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన హిట్ అయిన ‘సైవం’ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యనున్నాడని తెలిపాము. ఈ సినిమాని క్రిష్ ఉషా కిరణ్ మూవీస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాకి ‘దాగుడుమూతల దండాకోరు’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు. త్వరలోనే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు, నటీనటులు ఎవరు అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. క్రిష్ తెలుగులో చివరిగా చేసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా కమర్షియల్ గా విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత క్రిష్ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే.

తాజా వార్తలు