
‘వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్’ ‘రా రా కృష్ణయ్య’ లాంటి వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్. తన తాజా చిత్రం ‘జోరు’ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకోలేకపోయిన సందీప్ కి వున్న స్టార్ పవర్ వల్ల మంచి ఓపెనింగ్స్ సాధించింది.
‘జోరు’ రిలీజ్ అయిన ఒక్క వారం లోనే ‘బీరువా’ అనే మరో ఎంటర్టైనర్ తో సందీప్ రెడీ గా వున్నాడు. టైటిల్ చాలా ఇంటరెస్టింగ్ వున్న ఈ చిత్రం కధా పరంగా ఏ విధంగా వుంటుందో వేచి చూడాలి. ఈ చిత్రం సందీప్ కెరీర్ కి ఏ విధంగా ఉపయోగ పడుతుందో కాలమే తేలుస్తుంది. కన్మణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో సురభి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది.

