
గత 15 రోజులుగా టాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మేము సైతం’ ప్రోగ్రాం గురించి ఎప్పటి కప్పుడు స్పెషల్ అప్డేట్స్ మీకందిస్తూనే ఉన్నాం. మేము సైతంకి సంబందించిన అప్డేట్స్ తో పాటు మేము సైతం కోసం నిర్వహిస్తున్న స్టార్ క్రికెట్ మ్యాచ్ గురించి కూడా మీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాం.. ఈ స్టార్ క్రికెట్ మ్యాచ్ కి నాగార్జున, వెంకటేష్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లు కెప్టెన్స్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ కెప్టెన్స్ అంతా కలిసి మొదటి సారిగా ఈ రోజు సాయంత్రం ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ క్రికెట్ మ్యాచ్ గురించిన విశేషాలను చెప్పనున్నారు. అలాగే క్రికెట్ మ్యాచ్ కర్టన్ రైజర్ ఈవెంట్ కూడా జరగనుంది. ఈ ఈవెంట్ లో ఈ నలుగురు కెప్టెన్స్ తమ టీం మెంబర్స్ ని సెలక్ట్ చేసుకుంటారు. అలాగే ఈ వేడుకని మీరు జెమిని టీవీలో ఈ రోజు సాయంత్రం 7 నుంచి – 9 గంటల వరకూ లైవ్ లో చూడొచ్చు. ఈ కర్టన్ రైజర్ వేడుకకి ఈ నలుగురు కెప్టెన్స్ తో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్ లతో పాటు మిగత యంగ్ హీరోస్ మరియు పలువురు హీరోయిన్స్ కూడా పాల్గొననున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ కి ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే 8 మంది ఉండే టీంలో ఆరుగురు హీరోస్ ఉంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. మరి ఏయే హీరో ఏయే హీరోయిన్ ఎవరి టీంలోకి వెళ్తారు అనేది తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే..

