ఈ రోజు విశాఖ హుధూద్ తుఫాన్ భాదితుల సహాయార్ధం తెలుగు చిత్రసీమ నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది.
వేడుకలలో అతి తక్కువగా మాట్లాడే మౌనిముని దర్సకేంద్రుడు రాఘవేంద్రరావు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మరియు కోడి రామకృష్ణ, శ్యాం ప్రసాద్ రెడ్డి, మురళి మోహన్ తదితరులు స్టేజిపై ‘గబ్బర్ సింగ్’ పాటకు డాన్స్ చేశారు. ఫేమస్ పాప్ సింగర్ బాబా సెహగల్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న సమయంలో వీరు స్టేజిపై సందడి చేశారు. బహుశా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి అరుదైన ఘట్టం చూడడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.
ఈ రోజు ఉదయం నుండి ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ కార్యక్రమంలో ప్రముఖులు నిర్విరామంగా ప్రదర్సనలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను సియం రిలిఎఫ్ ఫండ్ కు అందజేస్తారు.


