మెగాస్టార్ చిరు బ్యాక్ టు ఫామ్

మెగాస్టార్ చిరు బ్యాక్ టు ఫామ్

Published on Dec 1, 2014 2:38 PM IST

chiranjevi
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన గ్రేస్ఫుల్ స్టెప్స్ తో తెలుగ ప్రేక్షకులని ఉర్రూతలూగించిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. 1980, 1990లలో తన స్టైలిష్ డాన్సులతో అందరినీ ఆకట్టుకున్న చిరంజీవి రాజకీయాలలోకి ఎంటర్ అయ్యాక సినిమాలకి దూరం అయ్యారు. అప్పటి నుండి చిరంజీవి అభిమానులు ఆయన స్టెప్స్ ని మిస్ అవుతున్నారు. వారందరి కోరికని మెగాస్టార్ మేము సైతం ప్రోగ్రాంలో తీర్చేసాడు.

నిన్న జరిగిన మేము సైతం ప్రోగ్రాంలో చిరంజీవి స్టేజ్ పైన తన స్టైల్ అఫ్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. దేవీశ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న టైంలో వెంకటేష్ సపోర్ట్ ఇవ్వడంతో చిరంజీవిని స్టేజ్ పైకి తీసుకొచ్చి స్టెప్స్ వేయించారు. చిరుతో పాటు వెంకటేష్, అల్లు అర్జున్, రవితేజ, శ్రీకాంత్ లు కూడా స్టెప్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు.

మెగాస్టార్ లో ఏ మాత్రం ఎనర్జీ తగ్గలేదు, తను వేసిన జోష్ స్టెప్స్ తో రెచ్చిపోవడంతో, ఇది చూసిన మెగా అభిమానులు, సినీ అభిమానులలో ఎక్కడలేని ఆనందంలో నిదిపోయారు. ప్రస్తుతం చిరంజీవి తన 150వ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఇదే జోష్ ని మెగాస్టార్ తన 150వ సినిమాలో కూడా చూపిస్తాడని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు