
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న హారర్ కామెడీ సినిమా ‘ముని 3’ తనకు చుక్కలు చూపించిందని వాపోతుంది సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. రాఘవ లారెన్స్ స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అని తాప్సీ చెప్పింది.
‘ముని 3’లో ఒక సన్నివేశం షూట్ చేయడం కోసం నేను 9 గంటలు నీళ్ళలో గడపాల్సి వచ్చింది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని నీళ్ళలో నుండి బయటకొచ్చి చూస్తే నా శరీరమంతా దద్దుర్లు(రాషేస్) వచ్చాయి. అవి తగ్గడానికి కొన్ని రోజుల సమయం పట్టింది. కొన్ని సన్నివేశాలు షూట్ చేయడానికి 32 టేకులు తీసుకుందట. తర్వాత కండరాలు(మజిల్స్) పట్టేయడంతో, నా బాడీ నార్మల్ కండిషన్ లోకి రావడానికి ఫిజియోతేరపి చేయించుకున్నాను. చెన్నై బీచ్ లో మిట్ట మధ్యాహ్నం షూటింగ్ వలన ఎండకు కమిలిపోయాను. ఇలా ‘ముని 3’ సినిమా షూటింగ్ లో నాకు అన్ని చేదు అనుభవాలే. నరకం చూశాను అంటూ తన బాధను మీడియాకు చెప్పుకుని కాస్త కుదుటపడింది.
అసలే సుకుమారంగా సిటీలో పెరిగిన పిల్ల కదా… మాస్ డైరెక్టర్ ట్రీట్మెంట్ తట్టుకోలేకపోయింది. తాప్సీ నటించిన హిందీ సినిమా ‘బేబీ’ త్వరలో విడుదల కానుంది.

