‘మేము సైతం’ మన కొరియోగ్రాఫర్ల ప్రతిభను చాటింది : తమ్మారెడ్డి

‘మేము సైతం’ మన కొరియోగ్రాఫర్ల ప్రతిభను చాటింది : తమ్మారెడ్డి

Published on Dec 3, 2014 12:44 PM IST

tammareddy-bharadwaja
ఎప్పటినుండో తెలుగు పాటలకు తెలుగు కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేడు ఆ కల నెరవేరినందుకు చాలా అనందంగ ఉంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు తయారయ్యారు. గతంలో సినిమా పాటల చిత్రీకరణ మరియు ఏవైనా కార్యక్రమాలు జరిగినా.. ముంబై లేదా చెన్నై నుండి డాన్సర్లను పిలిపించేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. ఇతర అగ్ర హీరోల సినిమాలకు మన తెలుగు మాస్టర్లు కోరియోగ్రఫీ చేస్తున్నారు. ఇటివల జరిగిన ‘మేము సైతం’ కార్యక్రమంలో అన్ని పాటలకు ఇక్కడివాళ్ళు కోరియోగ్రఫీ చేశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది అని అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.

‘మేము సైతం’ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ్ పైవిధంగా వ్యాఖ్యానించారు. పరిశ్రమ పెద్దలతో పాటు నందిని రెడ్డి, దామోదర ప్రసాద్, ఇతర మేనేజర్లు డే & నైట్ కష్టపడ్డారని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు