మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అంజలి

మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అంజలి

Published on Dec 3, 2014 10:45 AM IST

Anjali1
‘గీతాంజలి’ తర్వాత మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి తెలుగమ్మాయి అంజలి గీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. ‘గీతాంజలి’ సినిమా చక్కటి విజయం సాధించడమే కాదు, అంజలికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’ సినిమాలతో పక్కింటి తరహా సంప్రదాయబద్దమైన పాత్రలకు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తను పర్ఫెక్ట్ ఛాయస్ అని నిరూపించుకుంది.

‘పిల్లా జమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వం వహిచబోయే తాజా సినిమా ‘భాగమతి’ కోసం అంజలిని సంప్రదించారట. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు అంజలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. మొదట అనుష్క ‘భాగమతి’గా నటిస్తుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ స్థానాన్ని అంజలి భర్తీ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు