కె.బాల‌చంద‌ర్ గారు సినిమా వున్నంత‌కాలం ఎప్ప‌టికి బ్ర‌తికేవుంటారు… ద‌ర్శ‌కుడు మారుతి

కె.బాల‌చంద‌ర్ గారు సినిమా వున్నంత‌కాలం ఎప్ప‌టికి బ్ర‌తికేవుంటారు… ద‌ర్శ‌కుడు మారుతి

Published on Dec 23, 2014 10:29 PM IST

maruthi
భార‌త‌దేశ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ గ‌ర్వించద‌గ్గ ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్, ద‌ర్శ‌కుడు పేరుతో సినిమా కి ప్రేక్ష‌కులు రావ‌టం మెద‌లుపెట్టింది ఆయ‌న త‌రం నుంచే.. స్టార్స్ ని న‌మ్ముకోకుండా ఆయ‌నే ఎంద‌రో న‌టీన‌టుల్ని స్టార్స్ ని చేసిన ఘ‌న‌త ఆయ‌నిది. ఏన్నో చిత్రాలు ఆణిముత్యాలు గా తీర్చిదిద్దిన బాల‌చంద‌ర్ గారి సినిమాలు మా ద‌ర్శ‌కుల కులానికి ఓ లైబ్ర‌రి గా నిలిచిపోతాయి. ఆక‌లిరాజ్యం చిత్రం నాకు చాలా ఇష్ట‌మైన చిత్రం. ఆయ‌న శ‌రీరానికి మ‌ర‌ణం వుందేమో గాని ఆయ‌న‌కి కాదు. ఆయ‌న చిత్రాల ద్వారా ఎప్పుడూ అంద‌రి హ్రుద‌యాల్లో చిర‌కాలం బ్ర‌తికేవుంటారు .. శారీర‌కంగా ఈలోకాన్ని వ‌దిలి వెల్లిన ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. అని అన్నారు ద‌ర్శ‌కుడు మారుతి

తాజా వార్తలు