
మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన లేడీ హీరో మంచు లక్ష్మీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే మంచు లక్ష్మీ తదుపరి చేయనున్న ‘పిలవని పేరంటం’ అనే సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా వెంకన్న బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరో పాత్రకి ఆరడుగుల అడవి శేష్ ని ఎంపిక చేసారు. అడవి శేష్ కి జోడీగా మంచు లక్ష్మీ కనిపించే అవకాశం ఉంది. ప్రియదర్శిని మూవీస్ – జైన్ మూవీస్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇది కాకుండా మంచు లక్ష్మీ నటించిన ‘బుడుగు’ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మంచు లక్ష్మీ మదర్ పాత్రలో కనిపించనుంది. సీధర్ రావు పదాన పాత్రలో కనిపించిన ఈ సినిమాకి మన్మోహన్ డైరెక్టర్. మరి ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ స్టొరీతో మంచు లక్ష్మీ ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

