ధనుష్ సరసన ఛాన్స్ కొట్టేసిన సమంత

ధనుష్ సరసన ఛాన్స్ కొట్టేసిన సమంత

Published on Dec 26, 2014 5:30 PM IST

danush-and-sruthi-hassan
సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ హీరో మరియు కొలవెరి డీ సాంగ్ తో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ధనుష్ హీరోగా వచ్చిన ‘విఐపి’ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ వేల్రాజ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. విఐపి చిత్ర టీంతోనే మరో సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. దానికి సంబందించిన అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి.

కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాలో హీరోయిన్స్ లో ఒకరిగా అమీ జాక్సన్ ని సెలక్ట్ చేసారు. తాజాగా మరో మెయిన్ హీరోయిన్ గా టాలీవుడ్ అందాల భామ సమంతని సెలక్ట్ చేసారు. తెలుగు సినిమాలకి సైన్ చెయ్యడంలో కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత ఈ మధ్య వరుసగా తమిళ సినిమాలకు సైన్ చేస్తోంది. ధనుష్ నటించిన విఐపి సినిమా తెలుగులో ‘రఘువరన్ బిటెక్’ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా జనవరి 1న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

తాజా వార్తలు