యు ట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తున్న తెలుగు సినిమాలు

యు ట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తున్న తెలుగు సినిమాలు

Published on Dec 28, 2014 8:30 PM IST

gopala-gopala-baahubali

ఒక సినిమాని తీయడం ఎంత కష్టమో దానిని సరిగా ప్రమోట్ చేసుకొని రిలీజ్ చెయ్యడం కూడా అంతే కష్టం. ఈ మధ్య కాలంలో ఫేస్ బుక్, ట్విట్టర్, యు ట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఎంతోమంది ఫ్యాన్స్, స్టార్స్, నిర్మాణ సంస్థలు తమ సినిమాలను ఇక్కడ ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. అంతే కాకుండా ఈ మధ్య స్టార్ హీరోల సినిమా వీడియోస్ యు ట్యూబ్ లో రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

తాజాగా గోపాల గోపాల మోషన్ పోస్టర్ మరియు బాహుబలి మేకింగ్ వీడియోలు యు ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్స్ సృష్టించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాంతో ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ కాగానే యు ట్యూబ్ లో రికార్డ్స్ సృటించింది. అలాగే టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి’. ఈ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. ఇలా వరుసగా తెలుగు సినిమాలు యు ట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

తాజా వార్తలు