
డైరెక్టర్ బోయపాటి శ్రీను నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు. ఈ రెండు సినిమాలు బాలకృష్ణ కెరీర్లోనే ది బెస్ట్ హిట్స్ లో నిలిచిపోయాయి. దాంతో బాలకృష్ణ అభిమానుల్లో బోయపాటిపై గౌరవం పెరిగింది. ఈ సంవత్సరం విడుదలైన లెజెండ్ సినిమా ప్రొద్దుటూరులో విజయవంతంగా 275 రోజులు ప్రదర్శించబడింది. దాంతో నిన్న సాయంత్రం లెజెండ్ 275 రోజుల విజయోత్సవ వేడుక చేసారు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణతో మూడవ సినిమా చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలిపాడు. ఈ విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ ‘సింహా తర్వాత కచ్చితంగా లెజెండ్ పై అంచనాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆ అంచనాలను నేను అందుకోగలిగాను. నేను ఆయనతో మూడో సారి కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాను. ఆ సినిమా సింహా, లెజెండ్ కంటే బెటర్ గా ఉంటుందని’ అన్నాడు. సాయి కొర్రపాటి – 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ మొదటిసారి బాలకృష్ణకి పవర్ఫుల్ సాంగ్స్ ఇచ్చాడు.

