
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2015 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాడు. మొదటిసారి అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్, సతీమణి స్నేహ రెడ్డితో కలిసి ఈ టూర్ ప్లాన్ చేసాడు. ఒక వారం రోజులు పాటు బన్ని ఫ్యామిలీ సౌత్ ఆఫ్రికాలోని అద్భుతమైన లొకేషన్స్ లో విహరించనున్నారు. అయాన్ కి ఇదొక మరపులేని జ్ఞాపకంగా మిగిలిపోవాలని బన్ని ప్లాన్ చేసాడు.
అల్లు అర్జున్ ఈ సంవత్సరం ‘రేసు గుర్రం’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. అది తన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులో చేరిపోయింది. ఇది కాకుండా ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి 5న రిలీజ్ కానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యా మీనన్, ఆద శర్మ హీరోయిన్స్ గా కనిపించనున్నారు.

