
నందమూరి హీరోలైన నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు చేస్తున్న అన్ని సినిమాలు చివరి దశ షూటింగ్ లో ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ ముగ్గురు హీరోలు న్యూ ఇయర్ కానుకగా అభిమానులకు ఒక బంపర్ గిఫ్ట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అవే వారు చేస్తున్న సినిమాల టీజర్స్.
బాలకృష్ణ – సత్యదేవ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి లయన్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. అంతే కాకుండా డిసెంబర్ 31 రాత్రి 11:48 నిమిషాలకు ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చెయ్యాలని ముహూర్తం కూడా పెట్టారు. ఇది పక్కన పెడితే ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న ‘టెంపర్’ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’ సినిమా థియేటర్ ట్రైలర్ ని కూడా న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇలా ఒకేరోజు నందమూరి హీరోలు తమతమ సినిమాలకు సంబందించిన టీజర్స్ విడుదల చేసి అభిమానులకి పెద్ద బూస్టప్ ఇవ్వాలనుకుంటున్నారు.
ఈ మూడు సినిమాల్లో కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’ సినిమా జనవరిలో రిలీజ్ కావడానికి సిద్దమవుతుంటే, ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ ఫిబ్రవరిలో రానుంది. బాలకృష్ణ ‘లయన్’ కూడా ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

