
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలైంది. ఇప్పటికే పూరి ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో ‘టెంపర్’ సినిమా చేస్తున్నాడు. ఇది పక్కన పెడితే పూరి ఇప్పటి యంగ్ జెనరేషన్ లో బాగా టాలెంట్ ఉండి దర్శకులవ్వాలి అనుకున్న వారికి అవకాశం కల్పించడం కోసం ఇటీవలే స్క్రిప్ట్ రైటర్స్ ని స్క్రిప్ట్ రాసి పంపమన్నాడు. అలా పంపిన వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ కూడా చేసాడు. ఇది కాకుండా ఇప్పుడు మరో డైరెక్టర్ హంట్ ని స్టార్ట్ చేసాడు. ఈ స్టార్ హంట్ ని సాక్షి తో కలిసి చేస్తున్నాడు.
అసలు విషయంలోకి వెళితే.. పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ‘ నేను 15 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు చేస్తున్నాను. నాకంటే తెలివైనవాళ్ళు ఈ యంగ్ జెనరేషన్ లో ఉన్నారు. వాళ్ళందరూ టాలెంట్ ఉన్నా ఎక్కడెక్కడో ఉన్నారు. రేపు రానున్న కొత్త సంవత్సరంతో కొత్త డైరెక్టర్స్ కూడా ఇండస్ట్రీకి రావాలి. కొత్త సంవత్సరంలో నేను రోజుకో కథ చెబుతా దానికి మీరు డైలాగ్స్ రాసుకొని 10 నిమిషాలలోపు ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. 10 రోజులు, 10 కథలు, 10 నిమిషాలు. ఏదైనా డిజిటల్ కేమరాతో షూట్ చేయండి. పూర్తి వివరాల కోసం డైలీ సాక్షి పేపర్ చూడండి. ఒక వేల మీరు రాలేదు అంటే మేము తీసే సినిమాలే చూడాలి, అవి బాలేవు అంటే మేము ఒప్పుకోం. సో దమ్ముంటే రండి మీ కోసమే ఈ డైరెక్టర్స్ హంట్’ అని ఛాలెంజ్ చేసాడు.
సో మరింకెందుకు ఫ్రెండ్స్ డైలీ సాక్షి పేపర్ కొనండి లేదా సాక్షి టీవీ చూడండి.. పూరి చెప్పిన కథకి డైలాగ్స్ రాసి షార్ట్ ఫిల్మ్ తీసి డైరెక్టర్ అయ్యే ఛాన్స్ కొట్టేయండి..

