జనవరి చివరి నుంచి రామ్ చరణ్ కొత్త మూవీ

జనవరి చివరి నుంచి రామ్ చరణ్ కొత్త మూవీ

Published on Dec 31, 2014 11:45 PM IST

Ramcharan
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో అటు ఫ్యామిలీ ప్రేక్షకులకు, ఇటు కుటుంబ కధా చిత్రాలకు దగ్గరయిన మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా విడుదలై చాలా రోజులవుతున్నప్పటికీ రామ్ చరణ్ ఇంకా తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. కానీ తన తదుపరి సినిమా శ్రీను వైట్లతో ఉంటుందని మేము ఇది వరకె తెలియజేశాం. శ్రీను చెప్పిన స్టోరీ లైన్ అటు మెగా స్టార్ కి ఇటు చెర్రీకి బాగా నచ్చడంతో ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ అయ్యింది.

ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుందా, సెట్స్ పైకి వేలుతుండా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానుల కోసం మేమొక న్యూస్ అందిస్తున్నాం. అదేమిటంటే రామ్ చరణ్ తన కొత్త మూవీని జనవరిలో ప్రారంభించి జనవరి 28 నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. మిగిలిన తారలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలుపనున్నారు. ఈ సినిమానే కాక చరణ్ గౌతం మీనన్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కు పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.

తాజా వార్తలు