దయాగాడి ‘టెంపర్’ కి సూపర్బ్ రెస్పాన్స్

దయాగాడి ‘టెంపర్’ కి సూపర్బ్ రెస్పాన్స్

Published on Jan 1, 2015 1:46 PM IST

Temper-ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరబాద్ లో జరుగుతోంది. ఎన్.టి.ఆర్ రోజూ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నాడు. న్యూ ఇయర్ కానుకగా ఎన్.టి.ఆర్ తన అభిమానుల కోసం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసాడు. ఈ టీజర్ కి అభిమానుల నుంచి, సినీ ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ లో ఎన్.టి.ఆర్ చెప్పిన ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయగాడి దండయాత్ర’ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

మరో వైపు టీజర్ లో ఎన్.టి.ఆర్ చూపిన సరికొత్త యాటిట్యూడ్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్ర టీం ఈ సినిమాని ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ ఆల్బమ్ ని జనవరి 18న రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఎన్.టి.ఆర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు