అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు – ఇటు విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘గోపాల గోపాల’. ఈ సినిమా నిర్మాతలైన సురేష్ బాబు – శరత్ మరార్ లు మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని ఈ రోజే మొదలు పెట్టాడు. ఈ రోజు ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ శబ్దాలయా స్టూడియోస్ లో డబ్బింగ్ చెబుతున్నాడు. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో ఆల్బంని మరో రెండు రోజుల్లో విడుదల చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ శ్రీ కృష్ణుడుగా కనిపిస్తే, వెంకటేష్ ఓ మధ్యతరగతి కుటుంబ పెద్దలా కనిపిస్తాడు. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రియ శరన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.


