యువతను ఉర్రూతలూగిస్తున్న “గోపాల గోపాల” బజే..బజే సాంగ్

యువతను ఉర్రూతలూగిస్తున్న “గోపాల గోపాల” బజే..బజే సాంగ్

Published on Jan 2, 2015 6:20 PM IST

gopala-gopala-audio
సాధారణంగా యువతకు మాస్ బీట్ లంటే మక్కువ చూపిస్తారు. అయితే నిన్నటినుండి ఒక క్లాస్ మరియు మెలడియస్ సాంగ్ యు ట్యూబ్ లలో, సెల్ ఫోన్ లలో మ్యూజిక్ ప్లేయర్ లలో మారుమోగిపోతుంది. ఎందుకంటే ఆ పాట పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన సాంగ్ కాబట్టి.

కృష్ణుడిని అల్లరిగా కవ్విస్తూ, అదే సమయంలో ఆ నీలమేఘస్వాముడి లీలలు తెలుపుతూ అనంత్ శ్రీరామ్ అందమైన మరియు అర్ధవంతమైన పదాలను పొద్దుకగా కూర్చాడు. దానికి ఏ మాత్రం తీసిపోని సంగీతం అనూప్ రూబెన్స్ నుండి సహకారం లభించింది. దీంతో సింగిల్ అటెంప్ట్ లోనే ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. నేటితో షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ఈ ఆదివారం ఆడియో విడుదలకార్యక్రమాన్ని జరుపుకోనుంది

తాజా వార్తలు