నైట్ షో కంప్లీట్ చేసిన నయనతార..!

నైట్ షో కంప్లీట్ చేసిన నయనతార..!

Published on Jan 3, 2015 10:32 PM IST

Nayanathara
నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా ‘నైట్ షో’. ఈ సినిమాలో మాయ పాత్రలో కనువిందు చేయనుంది. ఇటివలే ఈ సినిమా షూటింగును పూర్తి చేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ‘అనామిక’ తర్వాత నయనతార నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. ఓ వైపు కమర్షియల్ సినిమాలలో నటిస్తూనే నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు లభిస్తే వదిలిపెట్టడం లేదు. అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఆది హీరోగా నటిస్తున్నారు.

‘నైట్ షో’ టైటిల్ ప్రకటించిన తర్వాత సినిమాపై ఓ విధమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయితే టైటిల్ మార్చే ఉద్దేశ్యంలో దర్శకనిర్మాతలు ఉన్నారని చెన్నై మీడియా నుండి అందిన సమాచారం. ఇంగ్లీష్ పేర్లు టైటిల్ గా పెట్టినట్లయితే సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు లభించదు. ఆ కారణం చేత టైటిల్ మార్చాలని భావిస్తున్నారట. యూనిట్ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తాజా వార్తలు