
‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పటికే పూణే, హైదరబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ఈ చిత్ర టీం ఈ రోజు నుంచి మహేష్ బాబుపై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేస్తోంది. ఈ సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ స్పెషల్ సెట్ ని కూడా వేసారు. దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట చాలా బాగా వచ్చిందని ఈ చిత్ర టీం అంటోంది.
ఈ పాట కోసం వేసిన సెట్ మహేష్ బాబు మురారి సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ ని తలపించేలా ఉంటుందని అంటున్నారు. రాజు సుందరం ఈ పాటకి స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ మొదటి సారి జోడీ కడుతోంది. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

